COMMENCEMENT OF DARSHAN IN SRIVARI TEMPLE _ శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Tirumala, 08 September 2025: Darshan for devotees began at 6 AM on Monday in the Srivari Temple. As the lunar eclipse lasted from 9:50 PM on Sunday till 1:31 AM on Monday, the temple doors were closed at 3:30 PM on Sunday as per the tradition.

After nearly 12 hours, the temple doors were reopened at 3 AM on Monday. 

Following the temple purification rituals, Punyahavachanam, and other Kaikaryams, devotees were allowed for Darshan.

Due to the lunar eclipse, the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, which was closed at 3 PM on Sunday, was reopened at 7:30 AM on Monday. After the purification of the kitchen, Annaprasadam distribution to devotees commenced from 8:30 AM onwards.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

ముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం

ఉదయం 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌

తిరుమల, 2025 సెప్టెంబర్ 08: శ్రీ‌వారి ఆల‌యంలో సోమవారం ఉదయం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. ఆదివారం రాత్రి 9.50 నుండి 1.31 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం సాయంత్రం 3.30 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూశారు.

దాదాపు 12 గంట‌ల అనంత‌రం సోమవారం ఉదయం 3 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం

చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం ఉదయం 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.