COMMENCES MIDDAY MEALS AND DISTRIBUTES JAGANANNA KANUKA _ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం – జేఈవో శ్రీమతి సదా భార్గవి
TIRUPATI, 12 JUNE 2023: The JEO for Health and Education Smt Sada Bhargavi said TTD has been organising Mid-day Meals Scheme in its educational institutions on its own with an aim to provide qualitative food to its students.
The JEO commenced Mid-day Meals in the TTD-run Sri Govindaraja Swamy High School in Tirupati on Monday along with the distributions of Jagananna Vidya Kanuka kits. Speaking on this occasion, she said, the academic environment in TTD schools is more favourable than that of Corporate educational institutions with all facilities. Under the instructions of TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy, qualitative food is being served to nearly about 3000 pupils under this scheme. She called on the students to utilize all the privileges offered by TTD and make their career bright with the benign blessings of Sri Venkateswara Swamy.
TTD DEO Dr Bhaskar Reddy said, in the past four years many revolutionary changes took place under the leadership of JEO (H&E) in all the TTD educational institutions. With the team work and efforts of faculty members, the institutions reached great heights in the academic arena.
The Headmaster of the school, Sri Chandraiah, SGS College Principal Sri Venugopal Reddy, AEO of Education Department Sri Eswaraiah, Catering Officer Sri Vijaya Bhaskar, SV Primary School Headmaster Smt Reddemma, Sri Kodandarama Swamy High School HM Sri Surendra Babu and others were also present.
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం – జేఈవో శ్రీమతి సదా భార్గవి
– విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించి, జగనన్న విద్యా కానుక పంపిణీ చేసిన జేఈవో
తిరుపతి 12 జూన్ 2023: విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహార ఆహారం అందించడానికే టీటీడీ తన విద్యాసంస్థల్లో స్వయంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తోందని జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల లో సోమవారం ఆమె విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించి, జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా లేని తరహాలో టీటీడీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు చక్కని వాతావరణం, వసతులు కల్పించినట్లు తెలిపారు.స్వామివారి ఆశీస్సులతో బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. టీటీడీ విద్యా సంస్థల్లోని 3 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ద్వారా నాణ్యమైన ఆహారం అందించడానికి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఎంతో సహకరించారని ఆమె చెప్పారు.
డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగేళ్ళుగా జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో టీటీడీ విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారని అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ చంద్రయ్య, ఎస్జీ ఎస్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణు గోపాల్ రెడ్డి, ఎ ఈవో శ్రీ ఈశ్వరయ్య, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ విజయ భాస్కర్, ఎస్ వి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రెడ్డెమ్మ, శ్రీ కోదండ రామ స్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ సురేంద్ర బాబు తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది