COMPLETE JAMMU SV TEMPLE BY YEAR-END- TTD CHAIRMAN _ ఏడాది చివరకు జమ్మూ లో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి – పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala, 19 April 2022: TTD Chairman Sri YV Subba Reddy has directed officials to complete the construction works of Sri Venkateswara temple coming up at Majin village near Jammu by this year-end.

 

During his inspection at the work site, the Engineering officials explained him the status of ongoing works.

 

Officials said the majority of granite products like pillars etc. for the temple were expected to arrive from Kotappakonda in Guntur district while other materials have been locally procured.

 

TTD Chairman instructed the officials to prepare an action plan and stick to work schedule.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏడాది చివరకు జమ్మూ లో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి

– పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 19 ఏప్రిల్ 2022: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్ కు వివరించారు.

ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది