COMPLETE SRINIVASA SETU WORKS BY JUNE END-EO _ శ్రీనివాస సేతు నిర్మాణ పనులు 92 శాతం పూర్తి

TIRUPATI, 01 JUNE 2023: TTDD EO Sri AV Dharma Reddy said the Srinivasa Setu works are in the verge of completion and directed officials concerned to bring the bridge into public utility from July onwards

A review meeting with TTD and TMC officials was held in the EO Chambers in TTD administrative building on Thursday.

Speaking during the meeting the EO said 92% works have been completed and instructed to complete the remaining 8% works by June 30.

He also reviewed on medians, drainage, beautification of streets, lighting, painting etc. The EO said the pending works from Ramanuja Circle to MS Subbulakshmi Circle to be completed on a fast pace.

The TMC officials explained to the EO about the completed works through PowerPoint presentations.

JEO Sri Veerabrahmam, TMC Commissioner Smt Harita, CE Sri Nageswara Rao, TMC SE Sri Mohan, Smart City Special Officer Sri Chandramouli and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీనివాస సేతు నిర్మాణ పనులు 92 శాతం పూర్తి

– జూన్ నెల చివరి నాటికి పూర్తి చేసి జూలై నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి

– టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుపతి, 2023 జూన్ 01: శ్రీనివాస సేతు నిర్మాణ పనులు 92 శాతం పూర్తయ్యాయని, జూన్ 30వ తేదీకి మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేసి జూలై నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాల భవనంలో ఈవో ఛాంబర్ లో టిటిడి, మున్సిపల్ అధికారులతో కలిసి ఈవో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మీడియన్స్, మొక్కల పెంపకం, డ్రైనేజి, వీధుల ఆధునీకరణ, అవసమయిన చోట్ల పెయింటింగ్, లైటింగ్ తదితర పనులను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ నుండి సుబ్బలక్ష్మి సర్కిల్ వరకు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఇతర ప్రాంతాలలో తయారీలో ఉన్న బేరింగ్ లు, వాషర్లను వేగవంతంగా తెప్పించాలన్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుండి రామానుజ సర్కిల్ వరకు, శ్రీనివాసం నుండి కపిల తీర్థం, మంగళం రోడ్డు వరకు పూర్తయిన రోడ్లను మున్సిపల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు.

ఈ సమావేశంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, సి సిఈ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ శ్రీ మోహన్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శ్రీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.