CONCLUSION OF JYESTABHISHEKAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం _ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.

Tirupati, 08 July 2025: The three-day annual Jyestabhishekam at Sri Govindaraja Swamy Temple in Tirupati concluded on Tuesday with the grand Kavacha Samarpana to the utsava deity.
 
The rituals began with Suprabhatam and darshan for devotees. Sri Govindaraja Swamy, Sridevi, and Bhudevi were taken to the Kalyana Mandapam. From 8 AM to 11.30 AM, rituals like Sata Kalasa Snapanam, Mahashanti Homam, Tirumanjanam, Kavacha Pratishtha, and Akshatarohanam were performed amidst Vedic chanting.
 
The Kavacha Samarpana was performed from 12.30 PM to 4.30 PM. In the evening, from 5.30 PM to 6.30 PM, the deity was taken in a procession around the temple streets accompanied by Ubhaya Nachiyars.
 
Tirumala Peethadhipathis Sri Pedda Jeeyar Swamy and Sri Chinna Jeeyar Swamy, Dy EO Smt. V.R. Shanti, AEO Sri K. Munikrishna Reddy, other officials, and a large number of devotees participated.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.
 
తిరుపతి, 2025, జూలై 08 ;ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 08.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు.
 
అనంతరం శాత్తుమొరై, ఆస్థానం తదుపరి మధ్యాహ్నం 12.30 – 4.30 గం.ల మధ్య స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకుముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామ తం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
 
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ కె.మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.