CULTURAL FEAST _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

TIRUPATI, 10 NOVEMBER 2023: The series of art forms performed in front of Chinna Sesha Vahana Seva allured pilgrims in Tiruchanoor on Friday.

Besides the devotional programs organised by the HDPP wing of TTD mesmerized the art lovers in Tirupati City at Annamacharya Kalamandiram, Mahati Auditorium, Ramachandra Pushkarini and Shilpa Ramam in a big way.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
 
తిరుప‌తి, 2023 నవంబరు10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.
 
చిన్నశేష వాహనసేవలో…
 
బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహన సేవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వేషధారణలతో ఉండగా, ఇతర విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు లయబద్ధంగా సంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా లంబాడి నృత్యం, దింసా నృత్యం, కరగం, వీరనాట్యం, భరతనాట్యం, తిరుమొళి నాట్యం, కోలాటం, కేరళ కళాకారుల డ్రమ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
తిరుచానూరులోని ఆస్థానమండపంలో…
 
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం మంగళధ్వని, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం  నరసాపురానికి చెందిన శ్రీ సింగరాచార్యులు భక్తామృతం ధార్మికోప‌న్యాసం, బెంగళూరుకు చెందిన శ్రీ‌మ‌తి ఐశ్వర్య మహేష్ భక్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీ ఎం.రాముడు బృందం హ‌రిక‌థ, సాయంత్రం శ్రీమతి సుశీల బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, ఊంజ‌ల్‌సేవ‌లో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరిగిరీష్ బృందం సంకీర్త‌న‌లు ఆల‌పించారు.
 
ఇతర వేదికలపై..తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సురభి కళాకారులు శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. 
 
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన డాక్టర్ మాధురి బృందం భ‌క్తి సంగీతం, హైదరాబాద్ కు చెందిన శ్రీమతి జానకి బృందం భరతనాట్యం చక్కగా  ప్రదర్శించారు.
 
రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ చంద్రశేఖర రావు బృందం సంగీతం వినిపించారు. 
 
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు  ధర్మవరానికి చెందిన శ్రీమతి మానస బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ  చేయబడినది.