CULTURAL FEAST ALL THE WAY _ మహాగణపతిం…, కమలాంబ…., సాంబ సదా శివ….. కీర్తనలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
TIRUPATI, 11 FEBRUARY 2026: As part of the ongoing annual Brahmotsavams of Sri Kapileswara Swamy, the cultural programmes organized in the temple premises enthralled the devotees.
Sri Sudhakar, rendered devotional compositions such as “Mahaganapathim,” “Kamalamba,” and “Samba Sada Siva,” immersing the audience in spiritual fervour.
Later, during the violin concert, Dr. Krishna and his troupe presented renowned compositions including “Vatapi Ganapathim,” “Endaro Mahanubhavulu,” “Nadatanumanisham,” “Siva Siva Sivayanarada,” and “Jaya Jaya Karunantaranga,” which were well received by the devotees.
Subsequently, Sri Ravi Subramanyam and his team mused the gathering with devotional pieces like “Mahaganapathim,” “Aigiri Nandini,” “Muddugare Yashoda,” and “Sivapanchakshari,” adding grandeur to the devotional programme.
The cultural events formed a significant spiritual highlight of the Brahmotsavams.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మహాగణపతిం…, కమలాంబ…., సాంబ సదా శివ….. కీర్తనలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి, 2026 ఫిబ్రవరి 11: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఇందులో బాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు గాత్రకచేరి నిర్వహించారు. ఇందులో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్ బృందం “మహాగణపతిం…, కమలాంబ…., సాంబ సదా శివ….., ” అను కృతులు సుమధురంగా ఆలపించారు.
తదుపరి వాయులీన్ కచేరీలో డా. కృష్ణ బృందం “వాతాపి గణపతిం…., ఎందరో మహానుభావులు…., నాదతనుమనిషం…, శివ శివ శివయనరాధ….., జయ జయ కరుణాంతరంగ…., ” వంటి కృతులు పాడి ప్రేక్షకులను అలరించారు. తరువాత శ్రీ రవి సుబ్రమణ్యం బృందం “మహాగణపతిం…., ఐగిరి నందిని…..,ముద్దుగారే యశోద….,శివపంచాక్షరి…” వంటి అంశాలతో భక్తులను ఆకట్టుకున్నాయి.






