CULTURAL FEST IN TIRUPATI _ వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన
వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన
తిరుపతి, 2024 అక్టోబరు 07 ; శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నాలుగో రోజు సోమవారం మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి ఎం గౌరవిరెడ్డి మరియు బృందం తమ నాట్య ప్రదర్శన గావించారు. ఈ ప్రదర్శనలో తాండవమాడే శివుడు అన్న పాటకు, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అన్న అన్నమాచార్య కీర్తనకు, మహదేవ శివ శంభో అన్న గీతానికి, భాగ్యాద లక్ష్మి బారమ్మ అనే పురందరదాస కీర్తనకు కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో సభను సమ్మోహితులను చేశారు.
శ్రీ రామచంద్ర పుష్కరణి వేదికలో దాస సాహిత్య ప్రాజెక్టు తరపున హైదరాబాదుకు చెందిన అమృతవల్లి, గీతావాణి బృందం వారి భక్తిసంగీత కార్యక్రమం 6.30 నుండి 8:30 వరకు జరిగింది. వీరి బృందంచే ఆలపించిన కీర్తనలు భక్తాదులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సప్తగిరి ఉపసంపాదకురాలు డాక్టర్ అల్లాడి సంధ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది