CULTURAL FETE AT SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2024 అక్టోబరు 06 ; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన అదివారం తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి రవి ప్రభ, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సత్యనారాయణ, శ్రీ ముని శంకర కృష్ణ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ” తైతిరియోపనిషత్ – సామాజిక సందేశం” అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి షణ్ముఖ ప్రియ మరియు హరిప్రియ బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ పార్థసారథి బృందం ‘విష్ణు సహస్రనామ పారాయణం’ ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు రాయచూర్ కు చెందిన శ్రీ వరదేంద్ర బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ నరసింహ చార్యులు ‘ శ్రీ వెంకటాచల మహత్యంలో గోవిందనామ వైభవం’ అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రాజేష్ కుమార్ డాక్టర్ విజయలక్ష్మి బృందం బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు టిటిడి ఆస్థాన గాయని డాక్టర్ శోభరాజ్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.