CULTURAL FIESTA DURING KRT BTU _ గరుడ వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన
Tirupati, 31 March 2025: The devotional cultural troupes enhance the grandeur of the annual Brahmotsavams in Sri Kodanda Ramalayam.
The ongoing annual fete in Tirupati has been witnessed by various artistes.
On fifth evening, the performances by eight teams comprising 95 artistes in front of Garuda Vahanam attracted the devotees.
Dhimsa dance, chekka bhajana, kolatam, portrayal of various deities added the richness to the celestial procession.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన
తిరుపతి, 2025 మార్చి 31: తిరుపతి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం రాత్రి గరుడ వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 8 కళాబృందాలు, 95 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.
బెంగళూరుకు శ్రీ శ్రీనివాస కోలాట బృందంకు చెందిన 25 మంది యువతుల కోలాటం, విశాఖపట్నం కు చెందిన భవదేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి సుగుణ కుమారి బృందంలోని 25 మంది యువతులు ” దింసా ” నృత్యం భక్తులను పరవశింపజేసింది.
చంద్రగిరికి చెందిన శ్రీ పద్మావతి చెక్క భజన బృందంలోని 15 మంది మహిళల చెక్కభజనలు, తిరుపతికి చెందిన శ్రీ గౌరీ శంకర కోలాట భజన వేషధారణ బృందంలోని కళాకారుల వివిధ దేవతామూర్తుల వేషధారణలతో భక్తులను ఆకట్టుకున్నాయి.
కడపకు చెందిన శ్రీ బాబు బృందంలోని 10 మంది కళాకారులు డ్రమ్స్ లయబద్ధంగా వాయిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.