CULTURAL ITEMS CONCLUDES _ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

TIRUPATI, 26 SEPTEMBER 2023: The nine-day cultural fiesta came to an end on Tuesday evening with the conclusion of Salakatla Brahmotsavams in Tirumala.

All three important stages including Annamacharya Kalamandiram, Ramachandra Pushkarini, and Mahati Auditorium in Tirupati displayed varieties of devotional dance and music programs that allured denizens.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2023 సెప్టెంబరు 26 ; శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, శ్రీమ‌తి ప్ర‌స‌న్న ల‌క్ష్మి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, శ్రీ‌మ‌తి పుష్పశ్రీ బృందం భ‌క్తి సంగీతం, శ్రీ లక్ష్మీనారాయణ భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం శ్రీ పిఎస్.రంగనాథ్ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, శ్రీమ‌తి విజ‌య‌లక్ష్మీ బృందం హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుపతి రామచంద్ర పుష్కరిణి వేదికపై అన్నమాచార్య ప్రాజెక్టు సమర్పణలో తిరుపతికి చెందిన శ్రీమతి జి.రాధ బృందం వారి భక్తిసంగీతంలో ‘శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ…., షోడశకళానిధికి…., మర్ద మర్ద మమ బంధాని…, మాధవ కేశవ మధుసూదన…, సకలశాంతికరము సర్వేశ్వర…. అను అన్నమాచార్య కీర్తనలను తమ శ్రావ్యమైన కంఠంద్వారా వినిపించి సభను రంజింపజేశారు. వీరికి వయోలిన్ పై కె. శంకర్, తబలాపై పి.పాండురంగ రావు , రిథమ్స్-శృతిపై సురేష్ సహకరించారు. కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

మహతి ఆడిటోరియలో మొదట తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్రవిభాగ అధ్యాపకురాలు డా. శ్రీమతి కొల్లూరి వందన తమ గాత్రకచేరితో భక్తాదులను సమ్మోహనపరచారు. వీరు త్యాగరాజ, అన్నమాచార్య కృత వేంకటేశనిన్ను…., పన్నగేంద్రశయన…, ఆతలు చేసిన సేవలు…. ఇత్యాది కీర్తనలను ఆలపించారు. వీరికి వయోలిన్ పై కొమాండూరి వేంకటకృష్ణ, మృదంగంపై కోటిపల్లి సురేష్ సహకరించారు.

తదుపరి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల భరతనాట్యవిభాగ అధ్యాపకురాలు శ్రీమతి శశికళ తమ శిష్య బృందంతో ‘శ్రీకృష్ణ రాసలీలలు’ అన్న అంశంపై ప్రదర్శించిన నృత్యరూపకం సభాసదులను ఆకట్టుకొంది. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా డా.వి.శేషుకుమార్ వ్యవహరించారు. ఇందులో సుప్రజ, స్వప్నకుమారి మొదలైనవారు నర్తకీమణులుగా నటించారు.

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ‌మ‌తి ఆపేక్ష బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల, తిరుపతి సుధాకర్, డా.అల్లాడి సంధ్య, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.