CULTURAL PROGRAMMES ALLURE TIRUPATITES _ 2023 శ్రీవారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Tirumala, 22 September 2023:The series of cultural programs arranged by TTD in connection with annual Brahmotsavams on various platforms in Tirupati have been impressing the denizens to a great extent.

Among the galaxy of programs held at Mahati, Ramachandra Pushkarini, Annamacharya Kalamandiram, and Bharatnayam, Classical vocal allured the audience.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2023 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2023 సెప్టెంబరు 22 ;శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్ర‌వారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుపతి మహతి కళాక్షేత్రంలో చెన్నైకి చెందిన ‘చిదంబరం ఇసై సాయినాట్యపల్లి’ వారు కలైసెల్వి గురు రమేష్ 11 మందితో కూడిన తమ బృందంతో చేసిన “భరతనాట్య” ప్రదర్శన వీక్షకులను అలరించింది.

ఈ నాట్యప్రదర్శనలో తందనాన ఆహి…,నాచ్చియార్ తిరుమొళి… తదితర కీర్తనలకు నర్తకీమణులు భవతరణి, దివ్య, సబిత, కలైవాణి ప్రదర్శించిన నృత్యం సభను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు వారు సమర్పించారు.

రామచంద్రపుష్కరిణి వేదికలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులైన చిన్నారులు జి. వేంకటవాయునందన్, జి.శ్రీనివాస వాయునందన్ తమ వయోలిన్ పై త్యాగరాజ, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తనలను వాయించి సభాసదులను సమ్మోహపరచారు. వీరికి వంశీకృష్ణ మృదంగంపై, ఘటంపై ప్రసాద్, తాళంపై సంతోష్ సహకరించారు.

తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఒడియా, ఒడిస్సీ నృత్య కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, జ‌ల‌జాక్షి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, బెంగ‌ళూరుకు చెందిన శ్రీ సుజ‌య్ బృందం భ‌క్తి సంగీతం, డా.ఎం.టి.ఆళ్వార్‌స్వామి భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం, సాయంత్రం శ్రీ బి.ర‌ఘునాథ్‌ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, శ్రీ మోహ‌న‌వంశీ హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ కె.చంద్ర‌శేఖ‌ర్ హ‌రిక‌థ కార్య‌క్ర‌మం భ‌క్తుల‌ను భ‌క్తిభావాన్ని పంచింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.