CULTURAL PROGRAMMES AT NADA NEERAJANAM _ నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు
TIRUMALA, 08 OCTOBER 2021: As a part of ongoing Srivari annual brahmotsavams at Tirumala, TTD has organized a series of devotional cultural programmes under the aegis of its Hindu Dharma Prachara Parishad wing.
As a part of this spiritual programme every day there will be Vishnu Sahasra Nama Stotra Parayanam between 9am and 9.45am, spiritual discourse on Venkatachara Mahatyam by Sri Ramakrishna Sesha Sai between 10am and 11.30am, Harikatha by Smt Vijaya Kumari followed by Annamayya Lahari by Kumari Archakam Manyachandram team between 3.30pm and 4.30pm.
All these programmes are telecasted by SVBC for the sake of global devotees.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2021 అక్టోబరు 08: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుపతికి చెందిన భారతీయ విద్యాభవన్ కళాబృందం సభ్యులు ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
టిటిడి పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేంకటాచల మహత్యంపై ఉపన్యసించారు.
హరికథ
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ భాగవతారిణి శ్రీమతి వి.విజయకుమారి మధ్యాహ్నం 2 నుండి 3.15 గంటల వరకు హరికథ పారాయణం చేశారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
కుమారి అర్చకం మాన్యచంద్రన్ బృందం మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట పలు అన్నమయ్య సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.