CULTURAL PROGRAMS ATTRACTS _ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న‌ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

TIRUMALA, 17 OCTOBER 2023:On the third day of ongoing Navaratri Brahmotsavams on Tuesday observed a series of devotional cultural programs on different platforms in both Tirumala and Tirupati.

Programs included Vishnu Sahasranama Parayanam, Harikatha by Smt Krishnakumari team in Astana Mandapam of Tirumala apart from renowned singer Smt Srinidhi and her team in Nada Neerajanam.

While in Mahati, Annamacharya Kalamandiram, Ramachandra Pushkarini the cultural programs by HDPP enthralled the denizens.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న‌ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

 తిరుమ‌ల‌, 2023 అక్టోబరు 17 ; తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ సంగీత దర్శకులు శ్రీనిధి బృందం ఆలపించిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు భక్తిభావాన్ని పంచాయి.

శ్రీనిధి నేతృత్వంలో “అన్నమయ్య పద పద్మ శోభ‌” పేరుతో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి రికార్డు చేశారు. ప్రస్తుతం శ్రీనిధి ఆధ్వర్యంలో శ్రీ సాకేత్‌, శ్రీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, క్రిష్ణ చిన్మ‌యి, శుమ‌శ్రీ మేఘ‌న‌, బాల సంజిత‌ కళాకారులు ఈ సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.