CULTURAL PROGRAMS GET LAUREL _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
Tirumala, 20 September 2023:The devotional cultural programs designed by TTD to perform in front of Vahana sevas and in various platforms in Tirupati received huge applause from devotees.
Under the direct supervision of TTD JEO for Health and Education Smt Sada Bhargavi, for the first time, artists are invited from a dozen states to perform their state art during the annual fete which is standing as a cynosure.
In Mahati, Ramachandra Pushkarini, and Annamacharya Kalamandiram, the devotional vocals by the court singers of TTD have been alluring denizens.
On Wednesday evening ace artists like Dr Nageswara Rao Naidu, Dr. Sabari Girish, and Sri Sudhakar rendered soulful Sankeertans besides Bharatnayam and Harikatha Parayanams.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2023 సెప్టెంబరు 20 ;శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, విష్ణుసహస్రనామపారాయణం, శ్రీమతి శ్రీదేవి బృందం భక్తి సంగీతం, శ్రీ స్థలసాయి స్వామి భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీ నాగేశ్వరనాయుడు బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీమతి జి.మునిలక్ష్మి హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల గాత్రవిభాగ ఆచార్యులు డా.శబరి గిరీష్ గాత్ర కచేరి వినసొంపుగా సాగింది. ఇందులో ఎంచి చూచితే ఇతనికి ఎవ్వరెదురు…., పరమలాభము శ్రీపతికి…. , నారాయణుడే సర్వనాయకుడు……, వెదకవో చిత్తమా వివేకించి నీకు…. అనే కీర్తనలను మృదుమధురంగా పాడారు. వీరికి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతి తిరుపతి సుధాకర్ మృదంగంపై, శ్రీమతి పూర్ణా వైద్యనాథన్ వయోలిన్ పై సహకరించారు. అనంతరం కళాశాల నృత్యవిభాగ అధ్యాపకులు రవిసుబ్రహ్మణం తమ శిష్యగణంతో భరతనాట్య ప్రక్రియలో గణేశపంచరత్నం, అయిగిరినందిని, అర్ధనారీశ్వరం మొదలైన వాటిని ప్రదర్శించి సభాసదులను మంత్రముగ్ధులను చేశారు.
అన్నమాచార్య కళామందిరంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల వాయిద్యసంగీతం భక్తులను మైమరపింపచేసింది. రామచంద్రపుష్కరిణి వేదికపై ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు కె.సుధాకర్ గాత్రం సభను అలరించింది. ఆ తరువాత భరతనాట్య అధ్యాపకుల మార్గదర్శనలో తమశిష్యులచే తందనానా ఆహి, శ్రీరామభజన, కృష్ణ గానం మొదలైనవి ప్రదర్శించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది