CULTURAL SKILLS REACHES PINNACLE _ అశ్వ‌ వాహనసేవలో సాంస్కృతిక వైభవం

TIRUMALA, 22 OCTOBER 2023: On the penultimate day of the ongoing Navaratri Brahmotsavam on Sunday evening, the performances by various artists reached the highest point with the devotees giving thumbs up to the cultural programs during the mega religious fete.

In all, 395 artists belonging to 14 teams showcased their talents.  Sri Krishna Nrityakeli by the students of SV College of Music and Dance, Amba Maha Lakshmi Nrityam, Tandava Krishna Nrityam, Kali Nrityam, Sri Krishna Satyabhama Vijayam Nritya Roopakam are a few to mention.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అశ్వ‌ వాహనసేవలో సాంస్కృతిక వైభవం

తిరుమల, 2023 అక్టోబ‌రు 22: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం రాత్రి అశ్వ‌ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 14 కళాబృందాల్లో 395 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.

తిరుపతిలోని ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల విద్యార్థుల నృత్యం, తెలంగాణకు చెందిన డి. గౌరీ బృందం ప్ర‌ద‌ర్శించిన శ్రీకృష్ణకేళి నృత్యం, హైదరాబాదుకు చెందిన ఝాన్సీరాణి బృందం ప్ర‌ద‌ర్శించిన అంబా మహాలక్ష్మి నృత్యం, కర్ణాటక రాష్ట్రం ఆవేరికి చెందిన సందీప్ బృందం వీరస గాసే నృత్యం, తమిళనాడుకు చెందిన శివకుమార్ బృందం ప్ర‌ద‌ర్శించిన సర్ప మయూర నృత్యం ఆక‌ట్టుకున్నాయి.

అదేవిధంగా, తిరుపతికి చెందిన చందన బృందం కోలాటం, చెన్నైకి చెందిన పుష్కల బృందం తాండవ కృష్ణ నృత్యం అబ్బుర‌ప‌రిచింది. పాండిచ్చేరికి చెందిన మాలతి సెల్వం బృందం కాళీ నృత్యం, తిరుప‌తికి చెందిన బాబయ్య‌ బృందం ప్ర‌ద‌ర్శించిన శ్రీకృష్ణ సత్యభామ విజయం నృత్య‌రూప‌కం, రాజమండ్రికి చెందిన కె.రాణి బృందం జానపద నృత్యం అల‌రించాయి.

వీటితోపాటు విశాఖపట్నంకు చెందిన బి.శేష్మ బృందం కోలాటం, అనంతపురానికి చెందిన భాగ్యలక్ష్మి బృందం కోలాటం, తిరుపతికి చెందిన మురళీకృష్ణ బృందం దశావతారాలు వేష‌ధార‌ణ‌, తిరుమలకు చెందిన శ్రీనివాసులు బృందం కోలాటం ఆక‌ట్టుకున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.