CULTURAL TROUPES MESMERIZES DEVOTEES- నామ స్మరణతో మైమరిపించిన భక్తి సంగీతం
Vontimitta/Tirumala, 11 April 2025: On the occasion of Sri Sita Ram Kalyanam at Vontimitta, devotees were mesmerized by by the devotional cultural programs jointly organised by TTD’s Hindu Dharma Prachara Parishad and SV College of Musoc and Dance on Friday evening.
Began with Mangaladhwani at 3:30pm, the vocal concert by Dr K Vandana team, SmtSpoorthi Rao from Bengaluru, dance ballet on Sita Rama Kalyanam, Annamacharya Sankeertans by Dr Parupalli Ranganath and team impressed devotees.
HDPP Secretary Sri Sriram Raghunath, SVCMD Principal Dr Uma Muddubala and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఓ రామ నీ నామమేమి రుచిరా…..
రామభద్ర రఘువీర…….
– నామ స్మరణతో మైమరిపించిన భక్తి సంగీతం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం కల్యాణ వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన, కళాశాల విద్యార్థులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను మైమరిపించాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు అధ్యాపకులు, విద్యార్థులు ఆలపించిన ” రామరామ రఘురామ పరాత్పర….., పాహి కళ్యాణ రామ పావన గుణ రామ….., ఎక్కడ జూచిన మన శ్రీ రాముడే…..” తదితర సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
అంతకుముందు మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పంకు చెందిన శ్రీ మూర్తి బృందం మంగళ ధ్వని ఆహుతులను అలరించింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.