CURTAINS LAID DOWN TO CULTURAL PROGRAMS TO A CEREMONIOUS _ ముగిసిన బ్ర‌హ్మోత్స‌వ ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు- నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న శ్రీ రామాచారి అన్నమయ్య సంకీర్తనల ఆలాపన

TIRUPATI, 23 OCTOBER 2023:The grand gala of devotional cultural programs came to an end on Monday both at Tirumala and in Tirupati with the completion of Srivari Navaratri Brahmotsavams.

In the Nada Neerajanam platform at Tirumala, the performance by Sri Ramachary and team immersed the devotees in spiritual waves.

In Tirupati Mahati Auditorium, Smt Srivani Veena’s concert mesmerized the denizens while the dance by the disciples of Smt Usharani enthralled the art lovers.

Similarly in Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram, the programs allured the devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

ముగిసిన బ్ర‌హ్మోత్స‌వ ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

– నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న శ్రీ రామాచారి అన్నమయ్య సంకీర్తనల ఆలాపన

తిరుమల, 2023 అక్టోబ‌రు 23 ;శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు సోమవారం ముగిశాయి.

అదేవిధంగా తిరుమల నాదనీరాజనం మండపంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తనల ఆలాపన కార్యక్రమం సోమవారం ముగిసింది ప్రముఖ సంగీత విద్వాంసులు హైదరాబాద్ కు చెందిన శ్రీ రామాచారి తన శిష్యులైన సత్యయామిని, సాహితీ, శ్రియామాధురితో కలిసి అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు.

 తిరుపతి మహతి కళాక్షేత్రంలో మొదట శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వీణ విభాగ హెడ్ శ్రీమతి వై.శ్రీవాణి వీణావాద్య కచేరి సభను రంజింపజేసింది. కార్యక్రమం -అన్మమాచార్య కీర్తన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ తో ప్రారంభమైంది. ఆపై వాతాపి గణపతిం భజే, చక్కని తల్లికి చాంగుభళా, భాగ్యాద లక్ష్మీబారమ్మ, అయిగిరినందిని నందిత మేధిని, గరుడగమన తవ చరణకమల, భో శంభో శివశంభో, గోవింద నామాలు, జగడపు జనముల జాజర, కురయ్ ఒండ్రుమ్ అన్న కీర్తనలను వీణపై పలికించారు.

తదుపరి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నృత్యవిభాగ అధ్యాపకురాలు శ్రీమతి పి.ఉషారాణి వారి శిష్య బృందంతో సమర్పించిన కూచిపుడి నృత్యప్రదర్శన సభను భక్తిరస సాగరంలో ముంచెత్తింది. తాండవ నృత్యకరి అని గణేశస్తుతితో ఆరంభం కాగా, త్రిమాతలపై, శ్రీచక్ర రాజసుతే లకు గావించిన నృత్యప్రదర్శన సభను ఆకట్టుకుంది.

రామచంద్రపుష్కరిణి వేదికలో అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కె.ఉదయభాస్కర్, జి. లావణ్య గాత్రకచేరి సభాసదులను భక్తిరసవాహినిలో ముంచెత్తింది. వీరికి శ్రీ బాబూరావు తబలా, శ్రీ జాయ్ కీబోర్డు, శ్రీ ఎం.గంగులప్ప శ్రుతిపై సహకారమందించారు.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య సూరం శ్రీనివాసులు, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, అడిషనల్ ఎఫ్ఏసిఏఓ శ్రీ రవిప్రసాదు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల, అన్నమాచార్య ప్రాజెక్టు పిసిఓ డా.లత, తిరుపతిపురవాసులు పాల్గొన్నారు.

తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, శ్రీమతి అనిత బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, శ్రీమతి శివలీల బృందం భ‌క్తి సంగీతం, శ్రీ ప్రభాకర శర్మ భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం, సాయంత్రం శ్రీమతి సౌమ్యరేఖ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, రాత్రి శ్రీ రవిప్రసాదరాజు బృందం హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.