CVSO & Tirupati SP review on Srivari Brahmotsavams _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సివిఎస్వో, తిరుప‌తి ఎస్పీ స‌మీక్ష‌

Tirumala,14 September 2022: TTD CVSO Sri Narasimha Kishore and Tirupati Superintendent of police Sri Parameswar Reddy reviewed the security arrangements for Srivari annual Brahmotsavams slated from September 27 to October 5.

 

 

 

At the review meeting held on Wednesday at the Annamaiah Bhavan in Tirumala they discussed in elaborate over the arrangements to be made for the visit of CM of AP on September 27 for Dwajarohanam fete, Parking for devotees, vigilance on thefts and others.

 

 

 

They also discussed on hassle free queue lines, Ghat road patrolling, night patrols, procurement of additional security equipment, barricades to be erected etc.

 

 

 

TTD Vigilance Officials and District Police Officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సివిఎస్వో, తిరుప‌తి ఎస్పీ స‌మీక్ష‌

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 14: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల అన్నమయ్య భ‌వ‌నంలో బుధ‌వారం ఈ స‌మీక్ష జ‌రిగింది.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై చ‌ర్చించారు. అదేవిధంగా, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

ఈ స‌మీక్ష‌లో అద‌న‌పు ఎస్పీలు శ్రీ మునిరామ‌య్య, శ్రీ‌మ‌తి విమలకుమారి, శ్రీ కులశేఖర్, డిఎస్పీలు శ్రీ వేణుగోపాల్, శ్రీ కాటంరాజు, శ్రీ విజయ్ శేఖర్, విజిఓలు శ్రీ‌ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, సిఐలు శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు శ్రీ సురేంద్ర‌, శ్రీ సాయిగిరిధ‌ర్‌, శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.