DARSHAN FOR SCANNED TOKENS ALONE ALONG SRIVARI METTU _ శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ
TIRUMALA, 20 JUNE 2024: TTD has resumed scanning of Divya Darshan token at 1200th step along Srivari Mettu footpath route and the trial run for the same is carried out on Thursday.
The devotees who have taken Divya Darshan tokens at Srivari Mettu shall have to undergo scanning at 1200th step or else will not be allowed in Darshan queue lines as was in practice earlier.
The devotees are requested to make note of this change and plan their darshan accordingly.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ
తిరుమల, 2024, జూన్ 20: శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.
శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు.
కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.