DARSHAN TOKENS FOR TIRUMALA LOCALS ON JUNE 9 _  జూన్ 9న తిరుమ‌ల స్థానికుల‌కు ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

Tirumala, 8 Jun. 20: As a part of trial run darshan mulled by TTD, the locals of Tirumala are allotted darshan slot on June 10 for which the darshan tokens will be issued in Tirumala on June 9.

The locals shall procure darshan tokens in the 12 counters located at different places including five each at CRO General and Koustubham and two at RTC Bus Stand from 8am onwards on June 9 till the quota of 6000 tickets exhaust. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 9న తిరుమ‌ల స్థానికుల‌కు ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమల, 2020 జూన్ 08: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు తిరుమ‌ల స్థానికుల‌కు జూన్ 10వ తేదీ శ్రీ‌వారి ద‌ర్శ‌నాని క‌ల్పించ‌నున్నారు. ఇందుకోసం జూన్ 9న తిరుమ‌ల‌లోని మూడు ప్రాంతాల‌లో  టోకెన్లు జారీ చేయ‌నున్నారు.

ఇందులో భాగంగా తిరుమ‌లలోని 12 కౌంట‌ర్ల‌ల‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 8.00 గంట‌ల నుండి ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు.  ఈ కౌంట‌ర్ల‌లో చెరో 5 కౌంట‌ర్లు సిఆర్‌వో, కౌస్తుభంల‌లో, ఆర్‌టిసి బస్టాండ్‌లో రెండు కౌంట‌‌ర్ల‌లో 6 వేల ఉచిత టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు. 

అద‌న‌పు ఈవో త‌నిఖీలు

జూన్ 8, 9వ తేదీల‌లో ప్ర‌యోగ‌త్మ‌కంగా టిటిడి ఉద్యోగుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందుకోసం సోమ‌వారం ఉద‌యం నుండి టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీ కేంద్రాల‌ను ప‌లు మార్లు అధికారుల‌తో క‌లిసి త‌నిఖీలు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నానికి వ‌చ్చేఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ రూపొందించిన మార్కింగ్‌లో న‌డ‌వాలని సూచించారు. 

కాగా అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద ద‌ర్శ‌నం టోకెన్లు క‌లిగిన ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులకు ప్ర‌తి ఒక్క‌రికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ మ‌రియు శానిటైజెష‌న్ చేసిన అనంత‌రం మాత్ర‌మే తిరుమ‌ల దర్శ‌నానికి  అనుమ‌తిస్తున్నారు.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.