DARSHAN TOKENS ISSUED TO TIRUMALA LOCALS _ తిరుమల స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

TIRUMALA, 02 DECEMBER 2024: As resolved during the maiden TTD board meeting held last month, TTD Chairman Sri BR Naidu has commenced issuance of darshan tokens to Tirumala locals on Monday along with the local MLA Sri A Srinivasulu at the Community Hall of Balaji Nagar in Tirumala.

After issuing a few tokens to the residents speaking to media persons the TTD board chief said the board in its maiden meeting has taken a decision to restore the Darshan for the locals which was dispensed with a few years ago.

He said the locals have expressed immense pleasure for providing them an opportunity to have darshan of Sri Venkateswara.

Later the Additional EO said, TTD authorities have done a lot of exercise before deciding on the darshan quota for locals of Tirumala, Tirupati rural and urban, Renigunta and Chandragiri. 

“We have not reduced but balanced all other quotas including SSD, SED, and accommodated locals darshan quota also”, he maintained.

TTD Trust Board member Sri Santharam, CVSO Sri Sridhar, DyEO Sri Lokanatham and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

తిరుమల, 2024 డిసెంబరు 02: గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీర్మానం చేసిన మేరకు సోమవారం తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులుతో కలిసి తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించేందుకు తొలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు.

అనంతరం అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు దర్శన కోటా ఖరారు చేసేందుకు టీటీడీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారన్నారు. సామాన్య భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానికుల దర్శన కోటా పునరుద్ధరించామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ శాంతారాం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.