DASARATHA RAMA TAKES A RIDE ON PEARL CANOPY _ ముత్యపుపందిరి వాహనంపై దశరథరాముని కటాక్షం

TIRUPATI, 01 APRIL 2022: As part of the ongoing annual Brahmotsavam in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday evening, Lord as Dasaratha Rama blessed His devotees on Mutyapu Pandiri Vahanam.

 

Devotees offered Harati chanting Jai Sri Ram along four Mada streets.

 

Both the senior and Junior Pontiffs of Tirumala, Spl Gr DyEO Smt Parvati and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపుపందిరి వాహనంపై దశరథరాముని కటాక్షం

తిరుపతి, 2022 ఏప్రిల్ 01: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్ర‌వారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు  ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ప్రారంభమైన వాహన సేవ రాత్రి 10 గంటల వరకు జరగనుంది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని  తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

 వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.