DECEMBER FESTIVALS AT SRI KRT _ డిసెంబర్‌లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
DECEMBER FESTIVALS AT SRI KRT
Tirupati, 24 November 2023:The following are some of the special festivals at Sri Kodandarama Swami temple in the month of December.
December 1: Sitarama kalyanam on Punarvasu nakshatram at 11am.
December 2,9,16,23,30: Abhisekam on all Saturdays at 6 am
December 12: Amavasya Sahasra Kalashabisekam in the morning and Hanumanta Vahanam in the evening.
December 26: On Pournami day – Astottara Kalashabisekam in the morning, Tiruchi procession in the evening followed by Asthanam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబర్‌లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2023 నవంబరు 24 ; తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో డిసెంబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
డిసెంబర్ 1, 28వ తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
డిసెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
డిసెంబర్ 12న అమావాస్య సందర్భంగా ఉదయం 7 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
డిసెంబర్ 26న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.