DEEPAVALI ASTHANAM IN TTD LOCAL TEMPLES ON OCTOBER 20 _ అక్టోబ‌రు 20న టిటిడి స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

Tirupati, 18 October 2025: All the local temples under the umbrella of TTTD are gearing up to observe the traditional Deepavali Asthanam on the auspicious occasion of Deepavali on October 20.

The ritual will be observed in Sri Govindaraja Swamy Temple, Sri Kodanda Rama Swamy Temple of Tirupati, Sri Venugopala Swamy Temple of Karvetinagaram, other sub-temples on Monday.

The officials of the concerned temples are making the arrangements for the same.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 20 టిటిడి స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

తిరుపతి, 2025 అక్టోబ‌రు 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారిఆల‌యం, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యాల్లో అక్టోబ‌రు 20వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో….

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు.

దీపావళి సందర్భంగా సోమ‌వారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో…..

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో దీపావళి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.