DEEPAVALI ASTHANAM ON NOVEMBER 14 IN TIRUMALA TEMPLE _ న‌వంబ‌రు 14న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirumala, 9 Nov. 20: The annual Deepavali Asthanam in Sri Venkateswara Swamy temple at Tirumala will be performed on November 14.

On this auspicious occasion, the Utsava Murthies of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi accompanied by Sri Viswaksena will be seated at Bangaru Vakili facing Garudalwar.

The religious staff will perform Asthanam where new silk clothes will be adorned to Moola Virat as well to utsava deities. 

In view of this fete, all Arjitha Sevas including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam (all virtuals) except Sahasra Deepalankara Seva [Virtual] are cancelled by TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 14న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమ‌ల‌, 2020 న‌వంబ‌రు 09: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా న‌వంబ‌రు 14వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా న‌వంబ‌రు 14న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.