DEEPAVALI ASTHANAM ON NOVEMBER 5 _ నవంబర్ 5న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
TIRUPATI, OCTOBER 26: The religious ritual of Deepavali Asthanam will be performed in the temple of Lord Sri Venkateswara at Tirumala temple on November 5 in view of the Deepavali festival.
The temple administration of Tirumala Tirupati Devasthanams has cancelled Nijapada Seva, Arjitha sevas including Thomala, Archana, Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam, Vasanthotsavam in view of this spiritual ceremony. But sevas like Suprabhatam and Sahasradeepalankara Seva will be performed as usual.
On this occasion, Suprabhatam will be performed at 1am, Ekanta Tirumanjanam will be performed at 4am to Lord Malayappa Swamy along with his two consorts and chief commander near Bangaru Vakili, Visesha Samarpana at 6am, a procession of Viseshapadi at 7am, followed by offering of new silk vastrams to processional deity and presiding deity, Asthanam at Bangaru Vakili that takes place between 7am to 9am inside the srivari temple.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD
నవంబర్ 5న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల, 2010 అక్టోబర్ 26 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ 5వ తేదిన దీపావళి ఆస్థానం వైభవంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా నవంబర్ 5వ తేదిన శ్రీవారి ఆలయంలో నిజపాదసేవ, ఆర్జితసేవలైన తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలు నిర్వహించరు. అయితే సుప్రభాతర, సహస్రదీపాలంకర సేవలు యథావిధిగా నిర్వహిస్తారు.
దీపావళి ఆస్ధానం సందర్భంగా ఈ రోజు ఆలయంలో ఉదయం 1 గంటకు సుప్రభాతం, 4 గంటలకు బంగారు వాకిలి వద్ద ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు, సేనాధిపతి వారికి ఏకాంత తిరుమంజనం, 6 గంటలకు విశేష సమర్పణ, 7 గంటలకు ఆలయంలో విశేష పడి ఊరేగింపు, ఉదయం 7 నుండి 9 గంటల మద్య శ్రీ మలయప్ప స్వామివారికి, మూలవర్లకు విశేష నూతన వస్త్ర సమర్పణ, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.