DEEPAVALI ASTHANAM HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
TIRUMALA, 12 NOVEMBER 2023: Deepavali Asthanam was observed with religious fervour in Tirumala temple on Sunday.
Later speaking to media outside the temple TTD Chairman Sri B Karunakara Reddy along with the EO Sri AV Dharma Reddy extending Deepavali greetings to Srivari devotees said he prayed the Universal Lord Venkateswara to bless His devotees with happiness, the state as well the Country with prosperity.
Earlier the traditional temple court was observed at Bangaru Vakili wherein the processional deities of Sri Malayappa along with Sridevi and Bhudevi accompanied by Vishwaksena were seated facing Garudalwar.
Both the pontiffs of Tirumala, DLO Sri Veeraju, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari, HO Dr Sridevi, VGO Sri Nanda Kishore, Parupattedar Sri Uma Maheswara Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
తిరుమల, 2023 నవంబరు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు.
అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ ఆస్థానంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, డిఎల్ ఓ శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎస్ ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, విజివో శ్రీ నంద కిషోర్, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఫార్‌పతేధార్ శ్రీ ఉమా మహేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.