DENIZENS ENTHRALLED _ భక్తులను అలరించిన “పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం” సంకీర్తనలు
భక్తులను అలరించిన “పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం” సంకీర్తనలు
తిరుపతి, 2024 అక్టోబరు 06 ; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పలువురు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు విశేషంగా అలరించాయి.
సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ కుమార్, శ్రీ శ్యామ్ కుమార్ యుగళభక్తి సంగీతంలో తమ మృదు మధుర గాత్రంతో
అన్నమయ్య కీర్తనలైన పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం తదితర కీర్తనలతో శ్రోతలను అలరించారు.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి చిన్నమ్మ దేవి గాత్రకచేరి, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం భరతనాట్యం ప్రదర్శించారు.
శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే వీణ కచేరి, డా. శరత్ చంద్ర బృందం భరతనాట్యం ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది