DESCENDANTS OF ANANTALWAR CELEBRATE PURUSAIVARI TOTOTSAVAM _ తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

Tirumala, 01 March  20 ;  It was a grand gala of the convergence of hundreds of descendants of the renowned Sri Vaishnava Saint Sri Anantalwar at Purusaivari Tota in Tirumala on Sunday. 

The huge gathering consisted of the current 26th generation on the auspicious occasion of the 966th Avatarotsavam of Sri Anantalwar. 

Tirumala Sri Pedda Jeeyar Swamy, Sri Chinna Jeeyar Swamy and Sri Kanchipuram Manavala Jeeyar Swamy rendered Anugrahabhashanam on this ceremonious occasion while the famous publishers LIFCO chief Sri TNL Vijayasaradhi said he belongs to the 26th clan of Sri Anantalwar. 

The event was organised under the aegis of Alwar Divya Prabandham Project of TTD and the activities supervised by the special officer of the project Sri Rajagopalan. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

తిరుమల, 2020 మార్చి 01 ; శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 966వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 300 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

 ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిస్వామి అనుగ్రహబాషణం చేస్తు తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులుగతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.  

 అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, కాంచిపురం శ్రీ మనవాల జీర్‌ శ్రీశ్రీశ్రీ వడికేశరి అల‌గియ‌స్వామి (H.H.Vadikesari Azhagiya) ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి అనుగ్రహబాషణం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన లిఫ్రో గ్రూప్ అఫ్ ప‌బ్లికేష‌న్స్ ఛైర్మ‌న్ శ్రీ టిఎన్ఎల్ విజ‌య‌సార‌ధి మాట్లాడుతూ 966 సంవత్సరాల క్రిందట శ్రీ రామానుజాచార్యులవారు స్వామి కైంకర్యాని క్రమబద్దీకరించడానికి తన శిష్యుబృదంలో ఎవరైన ఉన్నారా అని అడిగినప్పుడు అనంతళ్వారు మందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి స్వామివారి పుష్పకైకర్యాన్ని ఉద్దరించి తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని వివరించారు.  
       
ఈ కార్యక్రమంలో హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అనంతాళ్వార్‌ వంశీకులు శ్రీ తాతాచార్యులు, సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
                                  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.