DEVOTEE DONATES DIAMOND-STUDDED GOLD HARAM TO SRI PADMAVATHI AMMAVARU _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు హారం విరాళం

Tirupati, July 13, 2026: A devotee from Vizianagaram, Sri Srinivasa, donated a diamond-studded gold haram weighing 56.8 grams to Sri Padmavati Ammavaru Temple, Tiruchanoor, on Monday.

The estimated value of the ornament is Rs.12.50 lakh.

Temple officials received the offering and presented the donor with Veda Ashirvachanam and Ammavari Theertha Prasadams.

Among those present were AEO Sri Devarajulu, Superintendents Sri Suresh, Sri Ramesh, and Sri Munichengal Rayulu, temple priest Sri Babu Swami, Temple Inspector Sri Chalapathi, and other officials.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు హారం విరాళం

తిరుపతి, 2026 జూలై 13: విజయనగరానికి చెందిన భక్తుడు శ్రీ శ్రీనివాస సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సుమారు 56.8 గ్రాముల బరువున్న వజ్రాలతో కూడిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు విరాళంగా సమర్పించారు.

ఈ హారం విలువ సుమారు రూ.12.50 లక్షలు.

ఆలయ అధికారులు దాతకు వేదాశీర్వచనం అందించి, శ్రీ పద్మావతీ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, శ్రీ మునిచెంగల్ రాయులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.