DEVOTEES CAUGHT IN DEVOTIONAL WAVES _  శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

TIRUPATI, 29 NOVEMBER 2024: Devotees have felt devotional vibes witnessing the series of spiritual programs organised by TTD in connection with the ongoing annual Brahmotsavam at Tiruchanoor.
 
Among the series of programs organised at various venues of Mahati, Asthana Mandapam, Silpa Ramam, Annamacharya Kalamandiram the Harikatha, Classical vocal and dance programs impressed the devotees.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
 

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుపతి, 2024 న‌వంబ‌రు 29: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రాఘవన్ ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీమతి భువనేశ్వరి బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి సుశీల బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ శబరి గిరీష్ బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు తిరుపూర్ కు చెందిన శ్రీ నరసింహారావు బృందం భక్త రంజని, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి కుమారి హారతి, శ్రీ మధుసూదన్ రావు బృందం భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6:30 గంటలకు శ్రీ కొండల రావు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి శిల్పారామంలో తిరుచానూరుకు చెందిన శ్రీమతి పప్పీ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.