DEVOTEES URGED NOT TO DONATE TO MISLEADING ORGANIZATIONS _ భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు
Tirumala, 20 November 2025: TTD Chairman Sri B.R. Naidu has appealed to all devotees of Sri Venkateswara not to donate under any circumstances to organizations that are attempting to mislead devotees.
It has come to the notice of TTD that certain individuals operating under the name, Global Hindu Heritage Foundation and savetemples.org are spreading false information claiming that an event will be held on November 29 to declare Tirumala, Tirupati and Tiruchanoor as Punyakshetrams.
These individuals are reportedly misleading devotees with fraudulent activities and attempting to collect donations deceitfully.
TTD urges devotees to remain vigilant, refrain from giving donations to such suspicious organizations, and avoid falling prey to their traps.
The Chairman stated that under the leadership of Honourable Chief Minister Sri Nara Chandrababu Naidu, all necessary measures are being taken to protect the sanctity of Tirumala and uphold the faith of devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు
భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి
తిరుమల, 2025 నవంబర్ 20: భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.
Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
