DEVOTION GRIPS WASHINGTON DC AS SRINIVASA KALYANAM ENTHRALLS DENIZENS _ వాషింగ్టన్ డిసి లో వైభవంగా శ్రీవారి కళ్యాణం

Tirupati, 05 July 2022: Srinivasa Kalyanam fete was observed with utmost religious grandeur at Washington DC in the United States of America during the early hours on Tuesday as per IST.

The team of TTD archakas and Veda pundits performed the Srinivasa Kalyanam as per Vaikhanasa Agama tradition to the accompaniment of Mangala Vaidyam.

TTD is organizing the holy event across various cities in the United States of America in collaboration with APNRTS and TTD advisory committees in each city.

The event was a celestial feast to the scores of NRI denizens who participated in the divine wedding ceremony with utmost enthusiasm and devotion.

The various stages of Srivari Kalyanam fete included Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpanam, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana, Varana Mayiaram and finally Harati. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వాషింగ్టన్ డిసి లో వైభవంగా శ్రీవారి కళ్యాణం

తిరుపతి 5 జూలై 2022: తిరుమల తిరుపతి దేవస్థానములచే అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో భారతకాల మానం ప్రకారం మంగళవారం వేకువ జామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎ పి ఎన్ ఆర్ టి ఎస్ టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేసుకుని కళ్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటోంది.

అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు.కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.

కళ్యాణం ఇలా…

శ్రీవారి కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది