DEVOTIONAL CULTURAL MUSICAL FIESTA IN KT _ గం గం గణపతే…., శంకరశ్రీగిరి…..,గంగాధీశ్వరం…., సంకీర్త‌న‌ల‌తో ఆల‌రించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు

Tirupati, 08 February 2026: As part of the annual Brahmotsavams of Sri Kapileswara Swamy, devotional music and dance programmes were organized on the first day on Sunday evening at the temple premises. 

The cultural events were conducted under the auspices of SV College of Music and Dance and SV Nadaswara and Dolu School.

A Nadaswara concert by instructors Sri Keshanna Dolu and Sri Nageswara Rao and their troupe was held from 5.30 pm to 6.30 pm. This was followed by a devotional vocal concert from 6.30 pm to 7.30 pm by Dr. Vandana, accompanied by Sri Jayaram on violin and Sri Ramesh on Mridangam, rendering kritis such as “Gam Gam Ganapathe”, “Shankara Srigiri” and “Gangadhiswaram”.

Later, a Bharatanatyam performance by Dr. Sarath Chandra and team was presented between 7.30 pm and 8.30 pm, featuring classical items including Nartana Ganapati, Bho Shambho, Kalabhairava Ashtakam, Shambho Mahadeva, Shanmukha Kautam, Natesa Kautam and Shiva Stuti.

College Principal Dr. Uma Muddubala was present and congratulated the artistes.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గం గం గణపతే…., శంకర శ్రీగిరి…..,గంగాధీశ్వరం…., సంకీర్త‌న‌ల‌తో ఆల‌రించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు

తిరుప‌తి, 2026 ఫిబ్రవరి 08: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక  శ్రీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భ‌క్తి సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై  సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వరం అధ్యాపకులు శ్రీ‌ కేశన్న డోలు, శ్రీ నాగేశ్వరరావు బృందం నాదస్వర కచేరి అందరిని ఆకట్టుకుంది. ఇందులో భాగంగా మహాగణపతిం, నిరవది సుఖదా అను కృతులు ఆలపించారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు శ్రీమతి డాll వందన గాత్రం, శ్రీ జయరాం వయోలిన్, శ్రీ రమేష్ మృదంగంపై “గం గం గణపతే…., శంకర శ్రీగిరి…..,గంగాధీశ్వరం….” కృతులు ఆల‌పించి భ‌క్తుల‌ను అలరించారు.

అనంత‌రం రాత్రి 7:30 నుండి 8:30 వరకు డా. శరత్ చంద్ర బృందం భరతనాట్యం అందరిని ఆకట్టుకున్నాయి భరతనాట్య కార్యకమంలో భాగంగా నర్తన గణపతి, భో శంభో, కాలభైరవ అష్టకం, శంభో మహాదేవ, షణ్ముఖ కౌతం, నటేశ కౌతం, శివ స్తుతి, పరమ పురుషుడు వంటి కృతులకు, కీర్తనలకు సి.సంధ్య, వీణ శర్మ, తన్మయి శ్రీ, ప్రతిక్ష, సమీర, చిన్మయి, రంజిత, యువశ్రీ, శివని, మహాలక్ష్మి, యువన కృతి, తనయ, భవిష్య, మోక్షశ్రీ, భవిష్య ఈ నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల  అనంతరం కళాకారులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల గారు అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.