DEVOTIONAL CULTURAL PROGRAMS ENTERTAIN _  శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో అలరించిన భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు

DEVOTIONAL CULTURAL PROGRAMS ENTERTAIN
 
TIRUMALA, 30 SEPTEMBER 2025: The devotional cultural programmes provide spiritual entertainment to the devotees in Tirumala.
 
On the seventh day, devotees were impressed by a series of Bhakti Sangeet at Nada Neerajanam, Vishnu Sahasra Nama Stotra Parayanam, Nadaswaram, Dharmic discourse, and Harikatha at Asthana Mandapam.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో అలరించిన భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు
 
తిరుమల, 2025 సెప్టెంబ‌రు 30 ;  శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన మంగళవారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు భక్తులను విశేషంగా అలరించాయి.
 
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీ వెంకట రాజు, శ్రీ లోకేష్, శ్రీ ఈశ్వర సాయి, శ్రీ అశోక్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల ఎస్వి ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపారాయణం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరల మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు తమిళనాడుకు చెందిన శ్రీ షీల రామస్వామి బృందం గాత్ర సంగీతం భక్తులను మైమరిపించింది.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి అనిత బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రమేష్ బృందం నాదస్వరం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీకాకుళంకు చెందిన డాక్టర్ రాజారావు ధార్మిక ఉపన్యాసం అందించారు. 
 
ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి హరికథ గానం చేశారు. 
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.