DEVOTIONAL CULTURAL TREAT IN TIRUPATI _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు _ మహతిలో ఆకట్టుకున్న మాయాబజార్ నాటక ప్రదర్శన
TIRUPATI, 15 OCTOBER 2023: As part of ongoing Navaratri Brahmotsavams, TTD has organized devotional cultural programs on various platforms in Tirupati which mesmerized the locals on Sunday evening.
The events included Sasirekha Parinayam-Maya Bazaar performed by the renowned Surabhi artists which enthralled the art lovers in Mahati Auditorium while in Ramachandra Pushkarini the devotional sangeet programme mused the audience. In Annamacharya Kalamandiram the vocals by Sri Madhusudhan Rao and Chadalawada Sisters allured the music lovers.
While in Astana Mandapam at Tirumala, famous Annamacharya Project artist Smt Bullemma performed, Harikatha Parayanam, Vishnu Sahasranama Parayanam attracted the devotees.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2023 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
– మహతిలో ఆకట్టుకున్న మాయాబజార్ నాటక ప్రదర్శన
తిరుమల, 2023 అక్టోబరు 15 ; శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన ఆదివారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో హైదరాబాదుకు చెందిన ‘సురభి’ శ్రీవినాయక నాట్యకళామండలి వారు కళారత్న శ్రీ ఆర్. వేణుగోపాలరావు 43 మంది బృందంతో “మాయాబజార్ (శశిరేఖాపరిణయము)” నాటక ప్రదర్శన వీక్షకులను అలరించింది.
ఈ నాటకప్రదర్శన – నారదుని రాకతో ప్రారంభమైంది. ఆపై శశిరేఖా అభిమన్యుల సంవాదము, బలరామ సుభద్రల సంభాషణ, తదుపరి శ్రీకృష్ణుడు సుభద్రను ఓదార్చుట, సుభద్రాభిమన్యులు అడవికి వెళ్ళడం, ఘటోత్కచ అభిమన్యుల యుద్ధం, హిడింబ-ఘటోత్కచ-సుభద్ర-అభిమన్యుల కలయిక, చివర శశిరేఖ-అభిమన్యుల పరిణయంతో ప్రదర్శనతో ముగిసింది.
రామచంద్రపుష్కరిణి వేదికలో దాససాహిత్య ప్రాజెక్టు వారు సమర్పించిన భక్తిరస సంగీతంలో బొమ్మిరెడ్డికొండలరావు బృందం భక్తి పాటలు భక్తి సంద్రంలో ముంచెత్తాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, డా. శేఖర్‌రెడ్డి బృందం విష్ణుసహస్రనామపారాయణం, దాససాహిత్య ప్రాజెక్టుకు చెందిన శ్రీమతి సంధ్య శ్రీనాథ్ బృందం భక్తి సంగీతం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టుకు చెందిన డా. కెటివి.రాఘవన్ భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీమర్ ఆర్.బుల్లెమ్మ బృందం అన్నమయ్య విన్నపాలు, రాత్రి శ్రీమతి పి.కౌసల్య బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
అన్నమాచార్య కళామందిరంలో శ్రీ జి.మధుసూదనరావు బృందం, చదలవాడ సిస్టర్స్ బృందం భక్తి సంగీత కార్యక్రమం భక్తులను భక్తిభావాన్ని పంచింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.