DEVOTIONAL SANKEERTANS ALLURE TIRUPATITES _ మైమరపింపచేసిన చైతన్య బ్రదర్స్ గాత్ర సంగీతం
TIRUPATI, 03 OCTOBER 2022:The beautiful compositions by Saint Musicians Sri Tyagaraja Swamy came alive with the melodious rendition by Chaitanya Brothers of Vizag in Mahati on Monday.
As part of ongoing annual Brahmotsavams in Tirumala, the HDPP wing of TTD has been organizing a series of devotional cultural programs at Mahati, Ramachandra Pushkarini, and Annamacharya Kalamandiram.
All these programs have been winning the hearts of art lovers in the Temple City of Tirupati.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మైమరపింపచేసిన చైతన్య బ్రదర్స్ గాత్ర సంగీతం
తిరుపతి, 03 అక్టోబరు 2022 ;తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా మహతి కళాక్షేత్రం లో సోమవారం నిర్వహించిన చైతన్య బ్రదర్స్ గాత్ర సంగీతం ప్రేక్షకులను మైమరపింపచేసింది.
విశాఖపట్నంకు చెందిన చైతన్య బ్రదర్స్‌గా ప్రసిద్ధిచెందిన శ్రీ బుక్కపట్నం కృష్ణమాచార్యులు, శ్రీ వారణాశి వేంకటేశ్వర శర్మ దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. వీరు అతి శ్రావ్యంగా ఆలపించిన పలు అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలు అహూతులను అలరించాయి. వీరికి వయోలిన్‌పై శ్రీ ఎం.సత్యనారాయణ, మృదంగంపై శ్రీ పి.బాలసుబ్రహ్మణ్యం, కంజీరపై శ్రీ ఎం.సూర్యప్రసాదరావు సహకరించారు.
ప్రదర్శన అనంతరం శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ కళాకారులను సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందించారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా, రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన బి.కేశవి బృందం చక్కటి నృత్య కార్యక్రమం చేపట్టారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.