DEVOTIONAL VOCAL ENTHRALLS _  తన్మయత్వంలో ముంచెత్తిన ‘అన్నమయ్య సంకీర్త‌న‌లు’

AMARAVATHI/TIRUMALA, 15 MARCH 2025: The devotional vocal rendered by renowned carnatic musicians Smt Nityasri Mahadevan and Priya Sisters enthralled the participants of Srinivasa Kalyanam at Venkatapalem on Saturday evening.

Earlier Smt Nityasri Mahadevan from Chennai presented note worthy Sankeertans including Srimannarayana, Srinivasa Tiruvenkata, Kurai Ondrum Illai while Shanmukha Priya and Hari Priya sisters mesmerized audience with the famous Annamacharya Sankeertans including Meluko Sringararaya, Adaro Padaro, Tirumala Giriraya and others.

The instrumental support by the respective artistes enhanced the grandeur of the devotional music.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తన్మయత్వంలో ముంచెత్తిన ‘అన్నమయ్య సంకీర్త‌న‌లు’

– పుల‌కించిన అమ‌రావ‌తి

అమరావతి / తిరుమ‌ల‌ 2025 మార్చి 15: వెంకట పాలెం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలోని శ్రీ‌వారి క‌ల్యాణ వేదిక వ‌ద్ద శనివారం సాయంత్రం చెన్నైకి చెందిన ప్ర‌ముఖ గాయ‌కులు శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్, ప్రియా సిస్టర్స్ ఆల‌పించిన సంకీర్త‌న‌ల‌తో అమ‌రావ‌తి ప్ర‌జ‌లు తన్మయత్వం చెందారు.

ఇందులో భాగంగా శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్ ” శ్రీ‌మ‌న్న‌రాయ‌ణ‌…, తిరుప‌తి వెంక‌ట‌ర‌మ‌ణ‌……, శ్రీ‌నివాస తిరువెంక‌ట ముడ‌య‌నే ….., కురై ఒండ్రుమ్ ఇళ్ళై…., నమో నమో రఘుకుల నాయక…..” త‌దిత‌ర కీర్తనలను సుమధురంగా ఆలపించారు.

ఆనంత‌రం ప్రియా సిస్టర్స్ ” మేలుకో శృంగార రాయ‌…., పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు….ఆడ‌రో పాడ‌రో అప్స‌రోగ‌ణ‌ము……, తిరుమ‌ల గిరి రాయ‌….., ఇదే శిరసు మాణిక్య, తెలిసితే మోక్షము” వంటి అనేక కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.