DEVUNI KADAPA BRAHMOTSAVAMS _ జనవరి 19 నుండి 27 తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
Tirupati, 04 January 2026: The annual brahmotsavams in Devuni Kadapa temple will be observed from January 19-27.
The Ankurarpana for the annual fete will be observed on January 18 between 6pm and 8pm in the famous temple of Sri Lakshmi Venkateswara Swamy in Devuni Kadapa of Kadapa district.
On January 24, Kalyanotsavam will be observed for which two devotees will be allowed on payment of Rs. 300 per ticket at 10:30am.
Important days includes Dhwajarohanam on January 19, Garuda Vahanam on January 23, Radhotsavam and Dhooli Utsavam on January 25, Vasanthotsavam and Chakra Snanam on January 27 along with Dhwajavarohanam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 19 నుండి 27 తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి/కడప, 2026, జనవరి 0: కడప జిల్లా, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19.01.2026 ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం) రాత్రి – చంద్రప్రభ వాహనం
20.01.2026 ఉదయం – సూర్యప్రభవాహనం రాత్రి – పెద్దశేష వాహనం
21.01.2026 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – సింహ వాహనం
22.01.2026 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
23.01.2026 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – గరుడ వాహనం
24.01.2026 ఉదయం – కల్యాణోత్సవం రాత్రి – గజ వాహనం
25.01.2026 ఉదయం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం
26.01.2026 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – అశ్వ వాహనం
27.01.2026 ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
