DEVUNI KADAPA BRAHMOTSAVAMS POSTERS RELEASED _ దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 17 Jan. 20: The annual brahmotsavams in Sri Prasanna Venkataramana temple in Devunikadapa of YSR district will be observed from January 26 to February 4, with Ankurarpanam on January 25, said JEO Sri P Basanth Kumar.
The JEO who released the posters related to this annual event in his chambers in TTD Administrative building in Tirupati on Friday along with the Outside Temples DyEO Sri C Govindarajan said, the big festival will be organized by TTD for nine days in a religious manner with Dhwajarohanam on January 26, Garuda Seva on January 30, Kalyanotsavam on January 31, Rathotsavam on February 1 and Chakrasnanam on February 3.
He said, the annual Pushpayagam will be observed on February 4 in the evening between 6pm and 9pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2020 జనవరి 17: టిటిడికి అనుబంధంగా ఉన్న వై.యస్.ఆర్.కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మ వార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
26-01-2020(ఆదివారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం
27-01-2020(సోమవారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం
28-01-2020(మంగళవారం) చిన్నశేష వాహనం సింహ వాహనం
29-01-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
30-01-2020(గురువారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం
31-01-2020(శుక్రవారం) కల్యాణోత్సవం గజవాహనం
01-02-2020(శనివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
02-02-2020(ఆదివారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం
03-02-2020(సోమవారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం
కాగా జనవరి 31వ తేదీ శుక్రవారం ఆలయంలో కల్యాణోత్సవం ఉదయం 9.30 నుండి 1130 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.