DEVUNI KADAPA TEMPLE FETE_ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati, 04 September 2025: Ankurarpana held for the annual Pavitrotsavams in Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa on Thursday.

The three day festival commences on September 05 and concludes on September 07.

Temple staff and priests were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి/ కడప, 2025, సెప్టెంబర్ 04: కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల‌కు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సంగ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.

సెప్టెంబరు 05వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, ద్వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు.

సెప్టెంబరు 06వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 07న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర విసర్జనాలు, మహా పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.