DHANURMASA FETE AT TIRUMALA TEMPLE FROM DECEMBER 17- JANUARY 14 _ డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం
TIRUPPAVAI PARAYANAM TO REPLACE SUPRABATHA SEVA FROM DEC 17
Tirumala, 07 December 2023: Dhanurmasa Utsavam in Tirumala will begin at 12.34 am of December 17 and last till January 14 in 2024.
During the month-long fete archakas recite Tiruppavai Parayanam penned by Andal Sri Goda Devi. On each day one Pasuram will be recited.
Instead of Sri Bhoga Srinivasa Murthy prayers are offered to Sri Krishna Swami in Ekantam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం
– డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల, 2023 డిసెంబరు 07: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 17వ తేదీన తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ ఉదయం నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి.
ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం…
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.