DHOTI SETS DONATED _ వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి పంచెలు పంపిణీ
TIRUMALA, 22 SEPTEMBER 2023: A devotee from Salem of Tamilnadu, Sri Tanga Dorai, has donated 120 sets of Dhoti to Melam Staff and Vahanam bearers of TTD worth around Rs.2lakhs on Friday in Tirumala.
He distributed the sets over the hands of TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy in Vaibhavotsava Mandapam after the completion of Pallaki Seva(Mohini Avataram).
Temple DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari, Parupattedar Sri Tulasi Prasad and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి పంచెలు పంపిణీ
తిరుమల, 2023 సెప్టెంబరు 22: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి శుక్రవారం తమిళనాడుకు చెందిన దాత శ్రీ తంగదొరై అనే భక్తుడు రూ.2 లక్షలు విలువైన 120 పంచెలను బహుమానంగా అందించారు.
ఉదయం పల్లకీ ఉత్సవం అనంతరం వైభవోత్సవ మండపంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చేతులమీదుగా దాత ఈ పంచెలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.