DHWAJAROHANAM HELD _ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirupati, 20 Feb. 22: The annual Brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple commences with Dhwajarohanam in the auspicious Meena Lagnam between 9am and 9:20am.
The Garuda Dhwajapatam was flagged off atop temple mast amidst chanting of Vedic hymns by priests.
Speaking on the occasion, JEO Sri Veerabrahmam said the annual fete will be observed in Ekantam following Covid norms.
He said elaborate arrangements of darshan and laddus have been made for the pilgrims during the nine-day fete.
Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu, Kankanabhattar Sri Seshacharyulu, Temple DyEO Smt Shanti, Additional Health Officer Dr Sunil, VSO Sri Manohar, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu, Temple Archaka Sri Balaji Rangacharyulu, temple inspector Sri Srinivasulu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉదయం 9 నుండి 9.20 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్ -19 నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, అనంత, గరుడ, విష్వక్సేనుల వారిని, గరుడ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శేషాచార్యులు కంకణబట్టార్‌గా వ్యవహరించారు.
కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ధ్వజారోహణం సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని, ఫిబ్రవరి 24న గరుడసేవ జరుగనుందని, ఫిబ్రవరి 28న ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూలు
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రోజుకు 5 వేల చొప్పున లడ్డూలను భక్తులకు విక్రయించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుభట్టాచార్యులు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, విఎస్‌వో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు
శ్రీ బాలాజి రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.