DHWAJAROHANAM PERFORMED WITH RELIGIOUS FERVOUR_ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirumala, 30 Sep. 19: The divine flag hoisting fete Dhwajarohanam for ensuing annual brahmotsavams in Tirumala temple was performed in the auspicious Meena Lagnam on Monday evening between 5.23 and 6pm. 

Sri Sitamachari rendered services as Kankanabhattar for the fete and will be doing all the Vaidika programmes during brahmotsavams in the same capacity.

Earlier,  the celestial flag bearing the image of Garudalwar was taken on a procession along the mada streets before the Dhwaja Patam is hoisted on temple Dhwajasthambham in the prescribed Muhurtam.

TTD Trust Board Chairman Sri YV Subba Reddy,  EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 సెప్టెంబర్ 30, తిరుమల 2019: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 5.23 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ సీతారామాచారి కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.