DHWAJASTAMBHA SAMPROKSHANAM PROGRAMS COMMENCES AT APPALAYAGUNTA TEMPLE _ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

Tirupati, 02 April 2025: The Dhwajastambha Samprokshanam programs at Sri Prasanna Venkateswara Swamy Temple in Appalayagunta religiously began on Wednesday morning.
 
As part of this, Vastu Homam was performed in the Yagasala from 8 am to 11.15 am on Wednesday.
 
Vedic programs like Kalapakarshanam and others will be held in the Yagasala from 6 pm to 8.30 pm.  The program was conducted by the Agamas under the guidance of the temple Chief Priest Sri Suryakumaracharyulu.
 
On April 3, Vedic programs will be held in the Yagashala from 8.15 am to 11 am, and the Maha Shanti Abhishekam and Purnahuti of the Jiva Dhwajastambha will be held from 4 pm to 6 pm.
 
On April 4, Vedic programs will be held in the Yagashala from 7.30 am to 9.30 am, followed  by the Maha Purnahuti and Kumbh Prokshanam.
Temple AEO Sri Devarajulu, Superintendent Smt Srivani, Temple
Inspector Sri Sivakumar and temple priests participated in this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం
 
తిరుప‌తి, 2024 ఏప్రిల్ 02 అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి.  
 
ఇందులో భాగంగా బుధ‌వారం ఉద‌యం 8 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వాస్తుహోమం నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కళాపకర్షణ, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఆలయ అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
 
ఏప్రిల్ 3న ఉద‌యం 8.15 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు జీవ ధ్వజస్తంభ మ‌హా శాంతి అభిషేకం, పూర్ణాహూతి జ‌రుగ‌నుంది. ఏప్రిల్ 4న ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు మ‌హా పూర్ణాహూతి, కుంభ ప్రోక్ష‌ణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.