DHWAJAVAROHANAM MARKS CONCLUSION OF ANNUAL FETE _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 25 JUNE 2024: The annual Brahmotsavam at Appalayagunta concluded on a grand note with Dhwajavarohanam on Tuesday.
 
The Garuda flag was lowered amidst the chanting of Vedic mantras.
 
DyEO Sri Govindarajan and other office staff were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 జూన్ 25: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.