DHWAJAVAROHANAM MARKS THE COMPLETION OF ANNUAL FETE _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 06 December 2024: The annual Brahmotsavams concluded on a grand religious note with the lowering of Dhwaja Patham on the temple mast at Tiruchanoor on Friday.
The Dhwajavarohanam was held amidst the chanting of Vedic mantras and the Gajadhwajam was lowered thanking the deities of all the worlds for successfully carrying out the Varshika Navahnika Karthika Brahmotsavam of Sri Padmavati Devi.
TTD EO EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 డిసెంబరు 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.