DHWAJAVAROHANAM PERFORMED _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు

Tirupati, 28 Feb. 22: The annual Brahmotsavams in Srinivasa Mangapuram complete on a grand religious note with Dhwajavarohanam on Monday evening held in Ekantam due to Covid restrictions.

 

Series of rituals like Garuda Dhyanam, Bheri Puja, Bheri Tandanam, Garuda Gadyam, Dikpalaka Gadyam, Garuda Lagnastakam and Garuda Churnika mantras were recited by Archakas while lowering the Garuda Dhwajapatam.

 

Temple DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu, Archaka Sri Balaji Rangacharyulu were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 28: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

సాయంత్రం 6 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది